జమ్మూ కాశ్మీర్లో డీఐజీ హేమంత్ కుమార్ లోహియా(57) దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం రాత్రి డీజీని తన ఇంట్లోనే ఎవరో గొంతు కోసి చంపారు. ఆ ఇంట్లో పని చేసే యసీర్ అహ్మద్ కనిపించకుండా పోవడంతో అతడే చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతని కోసం గాలిస్తున్నారు. అయితే ఇది తమ పనేనని పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ సంస్థ ప్రకటించుకుంది. అమిత్ షా పర్యటన సందర్భంలో ఇలా జరగడం కలకలం రేపుతోంది.