ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయ పట్టణంలోని పరిసర ప్రాంతంలో మంగళవారం ఉదయం భారీ వర్షం కురిసింది. దసరా సెలవులు కావడంతో అరకులోయ సందర్శన ప్రాంతాలను వీక్షించేందుకు వచ్చిన వివిధ ప్రాంతాల పర్యాటకులు వర్షంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల పాటు కురిసిన భారీ వర్షాల కారణంగా పర్యాటకులు, స్థానికులు, వాహనచోదకుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ వర్షంతో అరకులోయ ప్రాంతంలోని పలు రోడ్లు జలమయమయ్యాయి.