దసరా పండుగ సంధర్భంగా ప్రయాణికుల నుండి అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ రవాణా శాఖ ఉప కమిషనర్ రాజరత్నం పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల 2, 3 తేదీలో ప్రయివేటు ట్రావెల్స్ బస్సుల పై జరిపిన ప్రత్యేక తనిఖీలలో పర్మిట్ లేకుండా, ట్యాక్స్ కట్టకుండా ఇతర నిబంధనలను ఉల్లంఘించిన 44 ప్రయివేటు ట్రావెల్స్ బస్సుల పై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా 1 బస్సు సీజు చేశామన్నారు. ప్రయివేటు ట్రావెల్స్ బస్సుల పై ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని, ప్రయివేటు ట్రావెల్స్ యాజమాన్యం అధిక చార్జీలు వసూలు చేస్తే ఉప రవణా కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే అధిక చార్జీలు వసూలు చేస్తే బస్సులను సీజ్ చేస్తామన్నారు.