అమ్మాయిలు కొన్ని చిట్కాలతో మొటిమలను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం నీరు బాగా తాగాలి. ముఖం జిడ్డుగా మారకుండా చూసుకోవాలి. చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. పచ్చని కూరగాయలు, ఆకుకూరలు, తాజా పండ్లు తినాలి. డైరీ ప్రోడక్ట్స్, స్వీట్స్, చాక్లెట్స్, జంక్ ఫుడ్ వంటి ఆహారాలను ఎక్కువగా తినొద్దు. రోజూ సమయానికి నిద్రపోవాలి. చేతులతో మొటిమలను గిల్లొద్దు. బరువు ఎక్కువగా ఉంటే తగ్గడానికి ప్రయత్నించాలి.