విశాఖపట్నం, అరకు వ్యాలీ: పెదబయలు మండలంలోని బొండపల్లిలో గురువారం సాయంత్రం ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బొండపల్లి గ్రామంలో నివాసముంటున్న లక్ష్మి అనే మహిళ కూరకు తాళంపు కొరకు కడాయిని పొయ్యి మీద పెట్టి గ్యాస్ వెలిగించి మర్చిపోయి బయటకు వెళ్లి పోయింది. సుమారు రెండు గంటల తర్వాత కడాయిలో ఉన్న నూనె పూర్తిగా మరిగి మంటలు చెలరేగాయి దీంతో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైంది. అయితే ఆ సమయంలో ఎవరూ చుట్టుపక్కల లేకపోవడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఘటన చోటుకు స్థానికులు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు లక్ష రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.