ఆశావర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయడంతోపాటు సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకులు లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా సోమందేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈనెల 29, 30 తేదీల్లో నిర్వహించనున్న పథమ జిల్లా మహాసభలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16 సంవత్సరాలుగా పని చేస్తున్న ఆశవర్కర్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయన్నారు. మాతా, సంరక్షణ పేరుతో నియమించి నేడు అన్నిరకాల జబ్బులకూ సేవలు అందిస్తున్నారన్నారు.
వెంటనే వారందరికీ కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వడంతోపాటు 60 సంవత్సరాల తర్వాత బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని, మెటర్నరీ లీవ్‌లు, మెడికల్ లీవ్‌లు ఇవ్వాలని, పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన సెల్‌ఫోన్లు ఇవ్వాలన్నారు. అలాగే ఆయా సమస్యలపై చర్చించేందుకు నిర్వహిస్తున్న జిల్లా మహాసభలకు ప్రతి ఒక్కరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ, వెంకటలక్ష్మి, సుకన్య, మహిత, గంగులమ్మ, శంకరేశ్వరి, చంద్రలీల, కళావతి, నాగమణి, మాధవి, రమణమ్మ, ప్రభావతి, మంగమ్మ, రామకృష్ణమ్మ, రెహానాభాను, జయసుధ, శారదమ్మ, లత, రామలక్ష్మి, రమణమ్మ, సుశీల, తులసి, రుక్మిణి, శైలజ, శోభ, ఉమాదేవి, కళావతి, తదితరులు పాల్గొన్నారు.