వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధిని విస్మరించిందని మాజీమంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి విమర్శించారు. ఈ సందర్బంగా కొత్తచెరువు లోని పెనుకొండ రోడ్డులో టిడిపి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలపాలన్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు అవుతున్నా ప్రభుత్వం ఎలాంటి పనులూ చేసిన పాపానపోలేదన్నారు. గతంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా అభివద్ధి జరిగిందన్నారు. సత్యసాయి జిల్లాలో కియా పరిశ్రమను తీసుకొచ్చి ఎంతోమందికి ఉపాధి కల్పించామన్నారు. అంతేగాకుండా మరెన్నో కంపెనీలను రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలిపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఎస్. శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, మండల కన్వీనర్ రామకృష్ణ, టౌన్ కన్వీనర్ వలిపి శ్రీనివాసులు, వార్డ్ సభ్యుడు రమేష్‌బాబు, టిడిపి నాయకులు ఎస్, వెంకటరమణప్ప, విశ్రాంత టీచర్ నాగేంద్రప్రసాద్, శివప్రసాద్, బోయ రాజు, ఆలకుంట్ల శ్రీనివాసులు, ఎస్. వంశీకిషోర్, వైవి. మురళి, కిరణ్, బైరాపురం లక్ష్మీనారాయణ, భక్తవత్సలం నాయుడు, కిష్టప్ప, సుధాకర్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.