తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత్ శర్మ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ సూపరింటెండెంట్ శేషగిరి ఏవీఎస్ ఓ సైలేంద్రబాబు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. అమ్మవారి తీర్థప్రసాదాలను అధికారులు ఆయనకి ఇచ్చారు.