తెదేపా నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి హైదరాబాద్‌లో ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. వాహనాల కొనుగోలు కుంభకోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఆయనను ఈడీ అధికారులు శుక్రవారం బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో ప్రశ్నించారు. ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన అనంతరం జేసీ ప్రభాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రాజకీయ కక్షతోనే పై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని. ప్రభుత్వం చెప్పిందే రాజ్యాంగం అనే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. లారీల కొనుగోలు విషయంలో ఈడీ అధికారులు ప్రశ్నించారని చెప్పారు. రూ. వేల కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని. కేవలం 31 లారీల విషయంలోనే ఈడీ అధికారులు ప్రశ్నించారని తెలిపారు. రాష్ట్ర పోలీసుల్లా కాకుండా ఈడీ అధికారులు ఎంతో హుందాగా వ్యవహరించారని. నిజాయతీని నిరూపించుకోవడానికి ఈడీ కార్యాలయం ఒక వేదికని పేర్కొన్నారు. తాను ఎలాంటి మనీలాండరింగ్‌కు పాల్పడలేదన్నారు. ఈడీ అధికారులు ఎప్పుడు పిలిచినా వచ్చి దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.