ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంతరిక్ష వారోత్సవాలు ముగింపు సభ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 08, 2022, 11:59 AM

అంతరిక్ష ప్రయోగం విజయవంతం చేయడానికి ఇస్రో శాస్త్రవేత్తల్లో ఉన్న నిబద్ధత, క్రమశిక్షణ శ్రీసత్యసాయి ఇన్యుస్టూల్‌ ఆఫ్‌ హైయ్యర్‌ లర్నింగ్‌ విద్యార్థుల్లో, యాజమాన్య సిబ్బందిలో ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు కొనియాడారు. పుట్టపర్తి లోని ఇండోర్‌ స్టేడియంలో అంతరిక్ష వారోత్సవాలు ముగింపు సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఇస్రో చైర్మన్‌ కస్తూరిరంగన్‌, శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు మురళీధర్‌, డాక్టర్‌ శంకరన్‌, , సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టీ రత్నాకర్‌, సత్యసాయి విశ్వవిద్యాలయ వైస్‌ఛాన్సిలర్‌ సివి. సంజీవి తదితరులు పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా మాజీ ఇస్రో చైర్మన్‌ కస్తూరి రంగన్‌ మాట్లాడుతూ వివిధ రంగాల్లోని నిష్టాతులైన ఎంతోమంది ఇస్రోలో పనిచేస్తున్నారని అదేవిధంగా సత్యసాయి విద్యాసంస్థల్లో ఉన్న విద్యార్థుల సైతం ఈ రంగాన్ని ఎంచుకొని మంచి ప్రతిభ కనబరచాలని కోరారు. ఇందులో భాగంగా ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహించిన స్పేస్‌ వాక్‌కి అనూహ్య స్పందన లభించిందని చెప్పారు. ఈ పోటీలలో ఎంతోమంది విద్యార్థులు ప్రతిభ కనపరిచారన్నారు. ఈ పోటీలలో పదివేల మంది పాఠశాల, కళాశాలల విద్యార్థులు పాల్గొనడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కషిచేసిన సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇస్రో సంస్థలైన విఎస్‌ఎస్‌సి, ఐఎస్‌ఎసి, ఎస్‌డిఎస్‌సి నుంచి వచ్చిన శాస్త్రవేత్తలను ఎంతగానో ఆదరించారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఇస్రో శాస్త్రవేత్తలు చేతుల మీదుగా మెమోంటోలను అందజేశారు. ఈ సందర్భంగా సత్యసాయి ట్రస్టీ రత్నాకర్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com