ఛత్తీస్‌గఢ్‌లోని సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం 'ఛత్తీస్‌గఢ్ ఒలింపిక్స్' పేరుతో ఆటల పోటీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కబడ్డీ, ఖోఖో వంటి 14 గ్రామీణ క్రీడల్లో పోటీలు జరుగుతున్నాయి. తాజాగా ఓ గ్రామంలో చీరకట్టులో మహిళలు కబడ్డీ ఆడుతున్న వీడియోను ఐఏఎస్ అధికారి అవనీశ్ శరణ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీనికి నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది.