భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాపోరు యాత్రకు ప్రజలనుంచ్చి విశేష స్పందన లభించిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతుగుంట రమేష్ నాయుడు అన్నారు. శుక్రవారం రాజంపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రజా పోరు కార్యక్రమాలు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ మూడో తారీకు వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 7 వేల సభలు నిర్వహించడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అవినీతి అరాచక అసమర్థత పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రజా పోరు సభలు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు.