బెంగళూరులో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కడుపునొప్పితో బాధ పడుతున్న 19 ఏళ్ల యువతి ఇటీవల అవ్వతో కలిసి డాక్టర్ ఉబేదుల్లా క్లినిక్కు వెళ్లింది. సెలైన్ ఎక్కిస్తానని అవ్వను బయటకు పంపి, యువతి పట్ల అతడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఇటీవల జ్వరంతో బాధపడుతున్న యువతిని ఉబేదుల్లా వద్దకు తీసుకెళ్తానని కుటుంబ సభ్యులు అనగా వేధింపులను ఆమె బయటపెట్టింది. పరారీలో ఉన్న ఉబేదుల్లా కోసం పోలీసులు గాలిస్తున్నారు.