వేముల ఏపిఎం ఆంజనేయులును వెంటనే బదిలీ చేయించాలని మండల ఇన్చార్జి నాగేళ్ల సాంబశివారెడ్డిని మహిళా యానిమేటర్లు కోరారు. వేముల పట్టణంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఆయనను కలిసి మహిళలు తమ సమస్యలను వినిపించుకున్నారు. ఇక్కడ ఏపీఎంగా పనిచేస్తున్న రామాంజనేయులును లింగాల మండలానికి, అక్కడ ఏపీఎంగా పనిచేస్తున్న ఆంజనేయులు వేములకు డిప్యూటేషన్ పై బదిలీ చేశారు. లింగాల మండలంలో పనిచేసిన కాలంలో ఏపిఎం ఆంజనేయులుపై పలు ఆరోపణలు ఉన్నాయని, ఆయన ఆధ్వర్యంలో మేము పని చేయలేమని వారు వేడుకున్నారు. దీంతో మండల ఇంచార్జ్ ఈ సమస్యను పాడ ఓఎస్డి అనిల్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వివరించి ఏపీఎం ఆంజనేయులు పులివెందులకు బదిలీ చేసి అక్కడ పనిచేసే ఏపిఎం గురురాజ్ ను వేముల ఏపీఎంగా నియమించాలని మండల ఇన్చార్జి ఓఎస్డీ ని కోరారు.