చిత్తూరు, నగరి: నిండ్ర మండలంలో మంత్రి రోజా శనివారం పర్యటించారు. ఆరో రోజు సచివాలయం పరిధిలో రూ. 21. 80 లక్షలుతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని మంత్రి రోజా ప్రారంభించారు. జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో రైతులకు మేలు కలుగుతుందని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.