ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కౌన్సిల్లో చర్చించే అంశాలపై సమీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 08, 2022, 03:32 PM

తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ సమావేశంలో కౌన్సిల్ లో చర్చించే అంశాలపై తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీషా, కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి ముఖ్య అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో మేయర్ డాక్టర్ శిరీషా, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ గత కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై లేవనెత్తిన అంశాలపై ఎంత వరకు పరిష్కరించడం జరిగిందని ప్రశ్నించారు.


పెండింగ్ లో వున్న పనుల ఆలస్యంపై వివరణ అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా జరగనున్న కౌన్సిల్ సమావేశంలో చర్చించే అంశాలపై సమీక్ష నిర్వహించారు. తిరుపతి ఖ్యాతిని దేశంలో ముందుంచే కార్యక్రమాలను నిర్వహించాలని, తిరుపతి ప్రజలకు సౌకర్యాలను కల్పిస్తూ, అవసరమైన రోడ్లు, కాలువలు, నీటి సౌకర్యాలపై జరగనున్న కౌన్సిల్ సమావేశానికి తీసుకువస్తున్నట్లు మేయర్ డాక్టర్ శిరీషా, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి స్పష్టం చేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com