సింహం, పెద్ద పులిని చూస్తే జంతువులన్నీ వణికి పోతాయి. వాటిని ఆమడ దూరంలో చూడగానే ప్రాణభయంతో పరుగు లంకించుకుంటాయి. ఆశ్చర్యకరంగా ఓ శునకం మాత్రం పెద్దపులితో ఆడుకుంటోంది. పెద్ద పులి చెవిని కొరుకుతూ పరాచికాలు ఆడుతోంది. ఇదంతా ఓ సింహం దగ్గర నుంచి చూస్తుండగానే జరిగింది. చివరికి శునకం బారి నుంచి తనను విడిపించుకోవడానికి పులి చాలా కష్టపడింది. animals_powers ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. ఈ ఘటన జూలో కాకుండా అడవిలో జరిగి ఉంటే కుక్క చనిపోయి ఉండేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa