నెల్లూరు రూరల్ మండలం పొట్టే పాలెం ఆంజనేయస్వామి విగ్రహం వద్ద సెబ్ అధికారుల వాహన తనిఖీల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న 10 లక్షల విలువైన గుట్కాలను స్వాధీనం చేసుకున్నామని సెబ్ అసిస్టెంట్ కమిషనర్ ఎస్. రవికుమార్ తెలిపారు. నెల్లూరు నగరంలోని సెబ్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు.
అక్రమంగా గుట్కాలు తరలిస్తున్న గంగిరెడ్డి దుర్గారెడ్డి (36), పులి చేరి రుతువర్ధన్ , మునగంటి సాయి పవన్ కళ్యాణ్ లో అరెస్టు చేసి వారి వద్ద పది లక్షల గుట్కాల పాటు అశోక్ లేలాండ్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు.