ఆత్మకూరు: మీ సమస్యలు వినడానికే మీ ఇంటి ముందుకు వచ్చా. ఏ సమస్య ఉన్నా మీ ఇంటి బిడ్డగా భావించి చెప్పండమ్మా. పరిష్కారానికి కృషి చేస్తా అంటూ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్. రెడ్డి మహి ళలకు భరోసా ఇచ్చారు. మండలంలోని పంపనూరు గ్రామంలో శనివారం ఆయన జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మతో కలసి గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత సుబ్రహ్మణ్యశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఇం టింటికీ వెళ్లి మూడేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు చేకూరిన లబ్ధిని వివరిస్తూ బుక్ లెట్లు అందజేశారు. సమస్యలను తెలుసుకున్నారు. పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.