ధర్మవరం: పట్టణంలోని కోర్టులో నవంబర్ 12న జాతీయ మెగా లోక్ అదాలత్ను నిర్వ హించనున్నామని మండల న్యాయ విజ్ఞాన సదస్సు చైర్పర్సన్, సీనియర్ సివిల్ జడ్జి గీతా వాణి ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ మెగా లోక్అదాలత్లో రాజీ కేసులు మాత్రమే స్వీకరి స్తామన్నారు. సివిల్, క్రిమినల్ కేసులు, భరణం కేసులు, చెక్ బౌన్స్ కేసులు, భూమి, ప్రామిసరీ నోట్లు, కుటుంబ తగాదాలు, ఎక్సైజ్ కేసులు, భార్య, భర్త మనస్పర్థలు, ఆస్తి తగాదాలు తదితర కేసులను విచారించి తీర్పు ఇవ్వడం జరుగుతుందన్నారు. లోక్ అదాలత్లో ఇచ్చే తీర్పే తుది తీర్పు అవుతుందన్నారు. ఈ అవకా శాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవా లన్నారు. న్యాయవాదులు, పోలీసులు సమన్వ యంతో సహకరించాలని కోరారు.