పెద్దపప్పూరు: సైబర్ నేరగాళ్లను నమ్మి మోస పోవద్దని ఎస్ఐ ఖాజాహుస్సేన్ అన్నారు. శనివారం ముచ్చుకోటలో గ్రామస్తులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మీరు లక్కీ డ్రాలో గెలుపొందారని లక్షలాది రూపాయలు గెలుచు కున్నారని ఆ డబ్బు మీ బ్యాంకు ఖాతాలో జమ కావాలంటే కొంత డబ్బు చెల్లించాలని ఆశ చూపెట్టి మోసం చేస్తారన్నారు. ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి ఆధార్, బ్యాంకు ఖాతా నంబరు, ఓటీపీ చెప్పమని అడిగినప్పుడు పొరపాటున చెబితే బ్యాంకు ఖాతాలో ఉన్న మొత్తం దోచేస్తారన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా గ్రామ సచివాలయ పోలీసుకు తెలియజేయాలని ఆయన గ్రామస్తులకు వివరించారు.