మోతుకపల్లివద్ద ఉన్న పాత డంపింగ్ యార్డ్ లో బయోమైనింగ్ పద్దతి ద్వారా చెత్తను పూర్తీగా తొలగించడం జరుగుతుందని మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వర్రావు తెలిపారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా రూ. 4. 20కోట్లకు టెండర్లు వేశారని దీంతో బయోమైనింగ్ పద్దతి ద్వారా పాత డంపింగ్ యార్డ్ లో ఉన్న చెత్తను వేరుచేసే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అక్కడున్న చెత్తలో కవర్లు తదితర వాటిని వేరుచేసి పూర్తిగా అక్కడి నుంచి తొలగిస్తామన్నారు.