నరసరావుపేట ప్రకాష్ నగర్ కు చెందిన మీరంపల్లి శివ నాగరాజు (29)అదృశ్యమైనట్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదయింది. ఇటీవల ఫేస్ బుక్ లో పరిచయమైన అమ్మాయితో శివ నాగరాజు ప్రేమలో పడ్డట్టు తెలుస్తుంది. గత నెల 30వ తేదీ నుండి అదృశ్యమైన శివ నాగరాజు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తల్లి రామాంజమ్మ నరసరావుపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.