తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో దారుణం జరిగింది. పెరుమానల్లూరులో వడివేలు అనే వ్యక్తి కుటుంబంతో నివాసముంటున్నాడు. తన భార్యతో ఫ్రెండ్ ఈశ్వరన్ ఎఫైర్ పెట్టుకోవడం తెలిసి వడివేలు కోపంతో రగిలిపోయాడు. ఎఫైర్ మానుకోవాలని మందలించినా ఈశ్వరన్ వినలేదు. దీంతో మరో ఫ్రెండ్ అన్నాదురై సాయం తీసుకుని, ఈశ్వరన్‌ను రాళ్లతో కొట్టి చంపేశాడు. నిందితులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.