2023 ఏప్రిల్ నుంచి కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. బీఎస్ 6 ప్రమాణాలను కఠినంగా అమలు చేయనున్నారు. వాహనాల నుంచి వెలువడే కాలుష్యం తగ్గించేలా సెల్ఫ్ డయాగ్నోస్టిక్ డివైస్ ఏర్పాటుతో పాటు ఇతర అత్యున్నత ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. ఇవి కంపెనీల పై వ్యయ భారాన్ని పెంచనున్నాయి. దీనికి తోడు ద్రవ్యోల్బణం పెరగడంతో కార్ల ధరలు పెంచక తప్పని పరిస్థితి ఉంది. దీంతో కార్ల ధరలు మరింత కొండెక్కనున్నాయి.