దేశ వ్యాప్తంగా 35 లక్షల చెక్ బౌన్స్ కేసులున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు కేంద్రం సిద్దమైంది. చెక్ ఇచ్చిన బ్యాంక్ ఖాతాలో డబ్బు లేకుంటే ఆ వ్యక్తికే చెందిన ఇతర బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమెటిక్ గా డబ్బు కట్ అయ్యే విధానం రానుంది. చెక్ బౌన్స్ దోషులకు కొత్త బ్యాంకు అకౌంట్ నిషేధించడం, వారికి పరపతి రేటింగ్ లో కోత పెట్టడం వంటి వాటిని తీసుకురావాలని కేంద్రం భావిస్తుంది. దీంతో కేటుగాళ్లకు చెక్ పడనుంది.