ప్రస్తుతం పెళ్లిళ్లకు ముహూర్తాలు లేవు. అయితే సోషల్ మీడియాలో పెళ్లి వేదికలపై జరిగిన ఫన్నీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇదే కోవలో పెళ్లి వేదికపై వధూవరులు కొట్టుకున్న పాత వీడియో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. సాంప్రదాయం ప్రకారం వధువుకు వరుడు లడ్డూ తినిపించగా ఆమె ముఖం పక్కకు తిప్పుకుంటుంది. ఆ కోపంలో వధువు చెంపపై వరుడు కొడతాడు. ఆ తర్వాత వధువు కూడా వరుడిని కొడుతుంది. ఇలా పెళ్లి వేదిక రణరంగంగా మారిపోతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.