గత నెల 25వ తారీకున రాత్రి సమయంలో చేబ్రోలు మండలంలోని శేలపాడు గ్రామంలో పఠాన్ ఖాజా అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని తన ఇంటి ముందు పార్క్ చేసి ఇంట్లో పడుకొని మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచి బయటకు వచ్చి చూడగా తన బైక్ కనిపించలేదని ఎవరో గుర్తు తెలియని దొంగలు రాత్రి సమయంలో వచ్చి తన బైక్ దొంగలించి ఉంటారని అనుమానంతో చేబ్రోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. బైకు దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆదేశాల మేరకు తెనాలి సబ్ డివిజన్ డిఎస్పి స్రవంతి రాయి, పొన్నూరు సిఐ ప్రభాకర్, చేబ్రోలు ఎస్సై సత్యనారాయణ, జి వెంకటాద్రి సిబ్బందితో కలిసి రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నేరస్తుల కోసం గాలిస్తూ ఉండంగా వడ్లమూడి గ్రామ అడ్డరోడ్డు వద్ద మొహమ్మద్ అబ్దుల్ రషీద్, తాతా సుధీర్ కుమార్ అని ఇద్దరూ ముద్దాయిలను పట్టుకొని అరెస్టు చేశారు.
చేబ్రోలు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెనాలి డిఎస్పి స్రవంతి రాయి మాట్లాడుతూ ఇద్దరు ముద్దాయిలను అదుపులోకి తీసుకొని విచారించగా వారు చేబ్రోలు మండలంలోని కాకుండా చాలా చోట్ల బైక్ దొంగతనాలు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుండి మొత్తం 13 బైకులు స్వాధీన పరుచుకున్నామన్నారు. వీరిపై తెనాలి వన్ టౌన్, తెనాలి టూ టౌన్, తెనాలి రూలర్, అమర్తలూరు పొన్నూరు టౌన్, పొన్నూరు రూలర్, వేమూరు, దుగ్గిరాల, చుండూరు, పోలీస్ స్టేషన్లో బైకు దొంగతనం కేసులు ఉన్నాయని తెలిపారు. వీరి వద్ద స్వాధీనం చేసుకున్న బైకుల విలువ సుమారు 8 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పొన్నూరు సీఐ ప్రభాకర్, చేబ్రోలు ఎస్సై సత్యనారాయణ, వెంకటాద్రి, మరియు సిబ్బందిని అభినందించారు తెనాలి డిఎస్పి స్రవంతి రాయి.