మధ్యప్రదేశ్ సతనా ప్రాంతంలో అమానుష ఘటన జరిగింది. మైహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో కొన్నాళ్ల క్రితం నలుగురు దొంగలు పడ్డారు. అందులో రితేష్ రాజ్ అనే దొంగను భార్యాభర్తలు పట్టుకున్నారు. జైలు నుంచి ఇటీవలే అతడు విడుదలయ్యాడు. ఇటీవల కొందరితో కలిసి వారి ఇంటికి వెళ్లి మహిళను కొట్టాడు. ఆపై వివస్త్రను చేసి ఊరంతా తిప్పాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ దుశ్చర్యకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.