జైలు శిక్ష అనుభవిస్తున్న కాశ్మీరీ వేర్పాటువాద నాయకుడు అల్తాఫ్ షా (66) మంగళవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. మూత్ర పిండాల క్యాన్సర్‌తో బాధపడుతూ న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో కన్ను మూశారు. కొద్ది రోజుల క్రితం చికిత్స నిమిత్తం తీహార్ జైలు నుంచి ఎయిమ్స్‌కు తరలించారు. శ్రీనగర్‌లోని సౌరా ప్రాంతానికి చెందిన ఈ హురియత్ నాయకుడిని 2017 జూలై 25న ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.