బాపట్ల జిల్లాను రోడ్డు ప్రమాదరహితంగా మార్చేందుకు నిరంతరం కృషి చేస్తామని ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. ఆగష్టు నెలతో పోలిస్తే సెప్టెంబర్ నెలలో రోడ్డు ప్రమాదాల్లో 28%, రోడ్డు ప్రమాదాల వలన సంభవించే మరణాలు 48%కు తగ్గే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ఆగష్టు నెలలో జిల్లా వ్యాప్తంగా 55 రోడ్ ప్రమాదాలు వలన 27 మరణాలు సంభవించగా. సెప్టెంబర్ నెలలో 40 ప్రమాదాల్లో 14 మరణాలకు తగ్గాయని తెలిపారు.