భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో మంగళవారం సీతారాముల నిత్యకళ్యాణం కన్నులపండుగగా సాగింది. పవిత్ర గోదావరి నది నుండి జలాలను మేలతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ ప్రధాన ఆలయానికి తీసుకొచ్చి స్వామి వారి మూలవరులకు అభిషేకం చేశారు ్ ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి నిత్యకళ్యాణమూర్తులను బేడా మండపానికి భక్తుల జయజయ ధ్వానాల నడుమ తీసుకొచ్చి నిత్యకళ్యాణతంతు ప్రారంభించారు. తొలుత విశ్వక్సేన, ఆరాధన, పుణ్యాహవాచన జరిపి కళ్యాణతంతును కన్నులపండుగగా నిర్వహించారు. అనేక మంది దంపతులు ఈ కళ్యాణంలో పాల్గొని తరించారు.