ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ దేవాలయాల్లో క్షురకులుగా పనిచేసే వారికి రూ.20 వేలు కనీస ఆదాయం రానుంది. ఇది టికెట్ల ద్వారా క్షురకులకు సమకూరుతుంది. రూ.20వేల కంటే తక్కువ వచ్చే ఆలయాల్లో ఆ ఆలయ ట్రస్టు ద్వారా ఇప్పించేలా దేవాదాయ శాఖ, ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.