కొందరు వెనక వాహనాలను గమనించకుండా కారు డోర్లు తెరుస్తుంటారు. ఇలాంటి సందర్భాలలో యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతుంటాయి. ఈ తరహా ప్రమాదానికి సంబంధించిన వీడియోను కర్ణాటక రాష్ట్ర రోడ్ సేఫ్టీ అథారిటీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. సెప్టెంబర్ 24న ఈ ఘటన జరిగింది. హఠాత్తుగా ఓ వ్యక్తి కారు డోరు తెరవడంతో బైక్పై వస్తున్న మహిళ దానిని గుద్దుకుని రోడ్డుపై పడిపోయింది. మరుక్షణమే ఆమెపై నుంచి ఓ కారు ఎక్కేసింది. "పబ్లిక్ రోడ్లపై మీ కారు డోర్ తెరవడానికి ముందు, వెనుక నుండి వచ్చే వాహనాల కోసం సైడ్ లేదా రియర్ వ్యూ మిర్రర్లో చెక్ చేసుకోండి" అని అథారిటీ ట్వీట్ చేసింది.