ఏపీలో 400 కిలోల గాడిద మాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల పట్టణంలో నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్టు చేశారని పోలీసులు తెలిపారు. నిందితులు కిలో మాంసాన్ని రూ.600కు విక్రయిస్తున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు.