సౌత్ సెంట్రల్ లో మొదటిసారిగా రైల్ కోచ్ రెస్టారెంట్ ను గుంటూరు డి ఆర్ ఎం ఆర్. మోహనరాజు గుంటూరులో సోమవారం ప్రారంభించారు. ఈ రెస్టారెంట్ 24 గంటలు ప్రయాణీకులకు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించడమే గాక రైల్వేకు ఆదాయం కూడా వస్తుంది అని డిఆర్ఎం తెలిపారు. ఇంటీరియర్లతో కూడిన పరిశుభ్ర వాతావరణం రైలు ప్రయాణీకులకు చిరస్మరణీయమైన అనుభూతిని ఇస్తుందని డిఆర్ఎం అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ వీ. ఆంజనేయులు సిహెచ్ ప్రసాదరావు పాల్గొన్నారు.