తండ్రి మందలించాడనే కారణంతో బాలిక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం సాయంత్రం పెదనందిపాడు ఎస్ఐడి అశోక్ తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని కాట్రపాడు గ్రామానికి చెందిన గొర్రె పూజ (16 ) స్థానిక పెదనందిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. పాఠశాలకు సరిగా వెళ్లడం లేదని తండ్రి మందడించడంతో మనస్థాపం చెంది పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa