కర్నూలు: పెద్దకడబూరు: ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కారించడానికి మీ వద్దకు వచ్చానని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం మండల పరిధిలోని జాలవాడి గ్రామంలో గ్రామ సర్పంచ్ మల్లమ్మ, ఎంపీటీసీ వెంకటేష్, వైసీపీ నేతలు ఆంజనేయులు, శివ, బసన్న ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రెండవ రోజు కొనసాగించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి వృద్ధులు, మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ సంక్షేమ పథకాలు అమలు, వాటి లబ్ధి గురించి ఆరా తీశారు. అర్హత ఉండి పథకాలు అందకపోతే తన దృష్టికి తీసుకొని రావాలని, తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాలు అందించే సీఎం జగన్ ను మరువవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు ప్రదీప్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రఘురామ్, విజేయేంద్రరెడ్డి, ముక్కరన్న తదితరులు పాల్గొన్నారు.