చిత్తూరు నగరంలోని గిరింపేట పివికేయన్ డిగ్రీ కళాశాలలో బుధవారం ఘనంగా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో యువ ఉత్సవ కార్యక్రమాన్ని చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత అన్ని రంగాలలో ప్రావీణ్యం కలిగి ఉండాలన్నారు. వారిలోనే సృజనాత్మకతను వెలికి తీయడానికి నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ ఉత్సవ్ కార్యక్రమం హర్షనీయమన్నారు.
వివేకానంద స్వామిని యువత ఆదర్శంగా తీసుకొని సమాజంలో ముందుకు వెళ్లాలని సూచించారు. అనంతరం కార్యక్రమంలో యువతకు వివిధ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆనందరెడ్డి, నెహ్రూ యువ కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ ప్రదీప్ కుమార్, సిబ్బంది, యువతి, యువకులు పాల్గొన్నారు.