ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రైల్వే కోడూరు మండలం విపిఆర్ కండ్రిగ గ్రామపంచాయతీ నందు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు. నియోజకవర్గంలోని వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, జడ్పీటీసీలు, మండల కన్వీనర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa