పిల్లల చదువే తల్లిదండ్రులు ఆస్తి అని జిల్లా సమగ్ర శిక్షప్రాజెక్టు అధికారి అంబవరం ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కడప నగరంలోని ప్రాథమిక పాఠశాల, మున్సిపల్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాలలో నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ ఎన్నో విద్యా సంస్కరణలు ప్రవేశపెట్టిందని చెప్పారు. జిల్లా ఉప విద్యాశాఖ అధికారి రాజగోపాల్ రెడ్డి, ఎస్‌టియు టీచర్స్ అసోసియేషన్ కోశాధికారి ఇలియాస్‌బాష, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa