బాపట్ల శాసన సభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోనా రఘుపతి స్వల్ప అస్వస్థతకు గురయ్యారని ఆయన అంతరంగీకులు గురువారం తెలిపారు. రష్యా నుండి ఆయన బాపట్ల కు తిరుగు ప్రయాణం అయ్యే సందర్భంలో, కొంత ఛాతీలో అసౌకర్యానికి గురి అయ్యారు. దీంతో ఆయన హైదరాబాద్ లో ఆంజియోగ్రామ్ టెస్టు చేయించుకున్నారు. గుండె రక్తనాళాల్లో 1 వాల్వ్ లో పూడిక ఉండటంతో స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. మరో వారం రోజులపాటు ఆయనకు విశ్రాంతి అవసరం అని తెలిపారు.