తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెంనాయుడు గురువారం మంగళగిరి లక్ష్మీ నృశింహుని ఆలయాన్ని సందర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సుప్రీం కోర్టు చివాట్లు పెట్టినా సీఐడీ అధికారుల్లో మార్పురావడం లేదని అన్నారు. నిన్న తమ పార్టీ మీడియా కోఆర్డీనేటర్ నరేంద్రను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని సీఐడీ అధికారులను డిమాండ్ చేశారు.