తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రవీణ్ రెడ్డి ని అర్ధరాత్రి సమయంలో పోలీసులు అరెస్ట్ చేయడంపై కడప పార్లమెంటు టిడిపి మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్ భాష తీవ్రంగా ఖండించారు. అర్ధరాత్రుల అరెస్టుతో ఏమి సాధిస్తారని అన్నారు. ఎందుకు ఈ అరెస్టు ప్రొద్దుటూరులో అధికార పార్టీకి అవినీతిని ప్రశ్నించినందుకు, ప్రజల సమస్యలను ప్రపంచానికి తెలుపుతున్నందుకా
అండలేని అభాగ్యులకు అండగా నిలిచినందుకా అని అన్నారు. ఆర్. బి. కె టాక్స్ ని ఎదిరిస్తున్నందుక, తెలుగు దేశం జెండా మోస్తున్నందుకా అన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి సమయాలలో అరెస్టు చేయడంపై తీవ్రంగా ఖండించారు.