ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 3 శాతం ఉన్న రిజర్వేషన్ ను 4 శాతానికి పెంచుతూ సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నిర్ధారిత వైకల్యాలున్న వారికి 4 శాతం రిజర్వేషన్ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.