స్వయం శక్తి సంఘాల పట్ల ఆసక్తి కలిగిన మహిళలు కొత్త గ్రూపులుగా ఏర్పడ వచ్చని వెలుగు ఏసీ కొండలరావు అన్నారు. నరసన్నపేట మండలంలోని చోడవరం వీఓ పరిధిలో ఉన్న గెడ్డవానిపేటలో గ్రూపులో లేని మహిళలతో కొత్తగా గ్రూపులు ఏర్పాటు చేసి అల్లాడ బ్యాంకులో రుణాలు ఇప్పించే కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ మహిళ స్వయం శక్తి సంఘాల్లో చేరవచ్చన్నారు. ఈ మేరకు గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. గ్రూపు సభ్యుల అవసరాల మేరకు రుణాలు కల్పిస్తున్నామని ప్రతీ మహిళా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. గెడ్డవానిపేటలో 6 ఎస్ హెచ్ జి గ్రూపులను కొత్తగా ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంలు హేమసుందర్, అప్పలరామయ్య తదితరులు పాల్గొన్నారు.