కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన వ్యక్తిని అదృష్టం వరించింది. పోఖన్జు (40) అనే వ్యక్తి చేపల వ్యాపారి. బ్యాంకులో ఇంటి పత్రాలను తాకట్టు పెట్టి రూ.9 లక్షలు అప్పు చేశాడు. అది చెల్లించాలని బ్యాంకు బుధవారం అతడికి నోటీసులు అందించింది. అప్పు కట్టకుంటే ఇల్లు జప్తు చేస్తామని అందులో ఉంది. ఈ బాధలో ఉండగా కాసేపటికే అతడికి రూ.70 లక్షల లాటరీ దక్కింది. దీంతో అతడు సంతోషానికి అవధులు లేవు.