ఏటీఎం నుంచి డబ్బులు వస్తాయని అందరికీ తెలుసు. అయితే బెంగళూరులో శరణ్ హిరేమత్, సురేష్ చంద్రశేఖరన్ వినూత్నంగా ఆలోచించారు. ఏటీఎం తరహాలో వేడి వేడి ఇడ్లీలు, చట్నీ అందించే మెషీన్ తయారు చేసి, అందుబాటులోకి తీసుకొచ్చారు. మెషీన్ వద్ద మెనూ సెలెక్ట్ చేసుకుని, పేమెంట్ చేయగానే దానిలో నుంచి ఇడ్లీ, చట్నీ, కారప్పొడి ప్యాకింగ్ రూపంలో వస్తాయి. దీనిపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. దీనిని రూపొందించిన ఆవిష్కర్తలను ప్రశంసిస్తున్నారు.