ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం కృష్ణా నదికి పోటెత్తుతోంది. దాంతో నది ప్రవాహం ఉధృతంగా మారింది. కర్నూలు జిల్లాలో తుంగభద్ర జలాశయానికి వరద నీరు ప్రవాహం భారీగా పెరిగింది. దాంతో జలాశయం పూర్తిగా నిండిపోయింది. అలర్ట్ అయిన అధికారులు శుక్రవారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 55, 888 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 57, 294 క్యూసెక్కులు ఉంది.