తమ డిమాండ్ల సాధనకై ఎల్ఐసి ఏజెంట్లు శుక్రవారం వినూత్న నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా వారు చీరాల ఎల్ఐసి కార్యాలయం ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి కారణంగా ఎల్ఐసీ మునిగిపోయే నౌకగా మారిందని, దీంతో ఏజెంట్లు కూడా అవసానదశలో ఉన్నారని వారు పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్ఐసీ పాలసీలు తీసుకోడానికి ప్రజల ముందుకు రావడం లేదన్నారు. పాలసీపై బోనస్ తక్కువగా ఉండటం, ప్రీమియంపై జీఎస్టీ కట్టాల్సి రావడం ఇందుకు కారణమని వారు పేర్కొన్నారు. ప్రజలు పాలసీలు తీసుకోకుంటే ఏజెంట్ల పరిస్థితి ఏమవుతుందో కేంద్రం అర్థం చేసుకొని ఎల్ఐసి విధానాలను సవరించాలని వారు కోరారు.